Party Time-Illustration

Posted by చంద్రం on 12/21/2012 10:38:00 PM



Party Time-Illustration






కొత్త సంవత్సరం వొ...చ్చే...స్తోం...ది....!




RULE YOUR SENSES 3 (caution: nude illustration) కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.


Rule Your Senses 2

Posted by చంద్రం on 12/07/2012 03:26:00 PM


Rule Your Senses 2







Rule your Senses

Posted by చంద్రం on 11/28/2012 10:34:00 AM


Rule your Senses


RULE YOUR SENSES

Posted by చంద్రం on 11/26/2012 09:13:00 AM




    కాలిమడమ మీదనించి గరిమనాభి కదులుతూ మునివేళ్ళమీదకు చేరుతోంది.
    ముందర ఇంకో పాదం...!
    నాదే...!
    నా సర్వాంగాలనీ మోస్తూ నేలమీద ఆనుతోంది.
    నడక...!
    controlled falling...!
    నా లక్ష్యం...నా ధర్మం...నా జీవనధ్యేయం!
    ఎంత హాయిగా ఉందో...నడుస్తోంటే!
    ఎన్నాళ్ళు నడిచినా మళ్ళీ కొత్తగానే ఉంటుంది నాకు. 
    నేను మళ్ళీ న...డు...స్తు...న్నా...ను.
    నడుస్తూనే ఉన్నాను.
    నా పాదాలకింద మెత్తటి గడ్డిపూలు నలుగుతూంటే, గిలిగింతగా ఉంది...!
    పులకింతగా ఉంది...!
    సు...ఖం..గా ఉంది!
    పరవశం కలుగుతోంది...తన్మయత్వం కలుగుతోంది!
    వద్దు!
    వద్దు...!
    వొద్దొద్దొద్దొద్దొద్దు.
    ఈ గిలిగింత నాకొద్దు.
    ఈ పులకింత నాకొద్దు.
    ఈ పరవశం వద్దు. ఈ సుఖం...ఈ తన్మయత్వం వద్దు.
    నాకిప్పుడు నా పాదాలకింద నలుగుతోన్న గడ్డిపరక కావాలి. దాని తలమీద మొలకెత్తిన గడ్డిపూవు కావాలి. నా పాదాల కింద విరిగిపోతున్న దాని ప్రాణాలు కావాలి. దాని కలలు కావాలి. నా పాదాలను సిగ్గుపడేలా చేసి, దాని తలపై మోసే దాని విశ్వాసం కావాలి. నా కాలికింద వినమ్రంగా నలిగే దాని త్యాగం కావాలి. అది నేర్పించే బ్రహ్మజ్ఞానం కావాలి.


    నాకిప్పుడు నడిచేందుకు సంస్కారం కావాలి.

 




     RULE YOUR SENSES...!





                             

బాల్ ఠాక్రే అస్తమయం.

Posted by చంద్రం on 11/18/2012 06:17:00 PM
బాల్ ఠాక్రే అస్తమయం.









స్వాత్ లోయలో పాటకోయిల

Posted by చంద్రం on 10/18/2012 07:10:00 PM


స్వాత్ లోయలో పాటకోయిల!






తేది: 9 October 2012
స్టలం: స్వాత్ లోయ, మింగోరా.


    స్వాత్ లోయలో...
    ముఖానికి మాస్కులు ధరించిన...సాయుధులైన తాలిబాన్లు ఎప్పటిలాగే...బహుశా రోజూలాగే...తమ గన్నులు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించుకోదలుచుకున్నారు. అదేం పెద్ద విషయం కాదు. అప్పుడప్పుడు జరిగేదే. ఆంక్షలు పనిచేయనిచోట గన్నులు పనిచేస్తాయో లేదో పరీక్షించుకోవడం వాళ్ళకి మామూలే. ఇంతకు ముందు చాలా సార్లు జరిగిందే. ఎప్పుడైనా వాళ్ళ గన్నులు పని చేస్తునే ఉన్నాయి. అవి వాళ్ళనెప్పుడూ మోసం చేసింది లేదు.
    అదే నమ్మకంతో వాళ్ళు ఒకచోట ఆగి, ఎదురుచూడసాగారు.
అటుగా వొస్తున్న స్కూల్ వాన్ కనిపించింది. స్కూల్ పిల్లలు...పరీక్షలు రాసి ఇళ్ళకి తిరిగొస్తున్నారు. తాలిబాన్లు ముందుకు కదిలి, వాన్ ని ఆపేసారు. బహుశా అందర్నీ కిందకి దిగమనే ఉంటారు. ఎవరిమీద తుపాకి పరీక్షించాలో అని ఆలోచించలేదు వాళ్ళు.
    "మీలో మలాలా ఎవరు?" అని ప్రశ్నించారు.
    మలాలా యూసుఫ్జాయ్...!
    14 ఏళ్ళ అమ్మాయి.
    చందమామ లాంటి మొహం.
    చదువుకుంటోంది.
    పైగా, చదువుకోవద్దని అన్నందుకి...
    "How dare the Taliban take away my basic right to education?" అని మిన్ను విరిగి మీద పడేలా ఉరిమింది...BBC సాక్ష్యంగా! పరీక్ష కూడా రాసి వస్తోంది.
    "...లేదా మీ అందర్నీ కాల్చేస్తాను" తాలిబాన్ గర్జన.
    తన పేరు తాను చెప్పుకోవడం కూడా ఎవరికైనా జీవన్మరణ సమస్యగా మారిన క్షణం అది...! ఆ అమ్మాయికి అలాంటి భయమేం లేదు. పైగా ఇంతకుముందే చెప్పింది కూడా.."వాళ్ళు నన్ను చంపడానికి వొచ్చినా సరే, మీరు మా చదువుకునే హక్కుని కాదనటం సరైంది కాదనే చెబుతాను" అని.
    విస్పష్ఠమైన ధిక్కారం.
    అది 2009లో తాలిబాన్లు పెట్టిన ఆంక్షలకు విరుద్ధం.
    తమ గన్నులు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి 14 ఏళ్ళ మలాలా సరైందని తాలిబాన్లు అర్ఠం చేసుకున్నారు. ఎన్నో సంధర్భాల్లో తమకు సహకరించిన గన్నుల మీదున్న అపారమైన నమ్మకంతో రెండు సార్లు కాల్చారు... తలలో...మెడలో రెండు బుల్లెట్లు!
    పనిచేసాయి.
    ఎదురుగా రక్తపు మడుగులో మలాలా యూసుఫ్జాయ్.

                                                                                                            ***


తేది: 15 October 2012
స్టలం:United Kingdom.

    మరింత మెరుగైన వైద్యం కోసం మలాలా బర్మింగ్ హామ్ లోని క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్ కి మార్చబడింది.
16 October న మలాలా వైద్యానికి స్పందిస్తున్న తీరుకి డాక్టర్లు సంతృప్తి వ్యక్తం చేసారు.
17 October న మలాలా కోమా లోంచి బయట పడింది. ఆమె పూర్తిగా కోలుకునే అవకాశాలు మెరుగుపడ్డాయని డాక్టర్ల రిపోర్టులు చెపుతున్నాయి.
ప్రస్తుతం మలాలా కోలుకుంటోంది.
ప్రపంచంలోని అత్యంత నిపుణులైన డాక్టర్లు స్వాత్ లోయ పాటకు ప్రాణాలు పోయడానికి రేయింబవళ్ళూ శ్రమిస్తున్నారు.
చదువుకోవాలన్న ఆకాంక్షని అణువణూవునా నింపుకుని చావుని కూడా ధిక్కరించి పోరాడుతోంది ఆ పిల్ల. పోరాటమే జీవితమైన చోట పుట్టి, పెరిగిన మలాలాకి అదొక లెక్క కాదు.
ప్రాణం కంటే కూడా విలువైనదాని కోసం  మలాలా యూసుఫ్జాయ్ పోరాడుతోంది.
అది...
" మీ తుప్పుపట్టిన గన్నులు మామీద పనిచెయ్యవు గాక చెయ్యవు. మా ఆకాంక్షల మీద మీ ఆంక్షలు చెల్లవు గాక చెల్లవు" అని తాలిబాన్లకు చెప్పడం.



డెంగ్యూ యూనిఫామ్ కార్టూన్

Posted by చంద్రం on 10/15/2012 02:08:00 AM





డెంగ్యూ రాకుండా స్కూల్ పిల్లలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ సలహా...!


As dead as Dodo - మూడో భాగం

Posted by చంద్రం on 10/12/2012 02:41:00 PM
   

    ఈ వ్యాసంలో రెండో భాగంలో ఎత్తుగడ కోసమే జీవవైవిధ్యం లో వేటని ప్రాధాన్యాంశంగా చేయడం జరిగిందే తప్ప నిజానికి పరిణామక్రమంలో జీవవైవిధ్యం నిర్ణీతవేగంతో మార్పులకు గురవటం అనివార్యమైనది. ప్రకృతిలో ఆయా జీవుల మద్య సమతుల్యత లోపించడానికి వేట ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమవుతోంది. మన వేట అడవులమీదే కావొచ్చు...దాని వనరులమీదే కావొచ్చు...వాటిమీద ఆధారపడిన జీవులమీదే కావొచ్చు...కానీ, వేట ఏ రకమైనదైనా దాని అంతిమ ఫలితం దాదాపు ఒకేలాగా ఉంటుంది. 
    ఆధునికత మీద మోజు పెరగటం వలన మనం అకారణంగానే సాంప్రదాయక జీవన విధానానికి తిలోదకాలివ్వక తప్పదని నమ్మే దారిలో పయనిస్తున్నాం.
    నిజమే...!
    మనం చాలానే అభివృద్ది చెందాం....!
                                                                                ***
    ముప్పయ్యేళ్ళకే ఇల్లు కట్టడం ఇప్పుడు ఆనవాయితీ. ఇల్లుంటుంది...ఇల్లు మాత్రం ఉంటుంది...ఇంట్లో ఉండాల్సిన మనం మాత్రం చెల్లాచెదురై ఎక్కడెక్కడ ఉంటామో తెలీదు. మారుతున్న మన అలవాట్ల వలన, జీవనవిధానాల వలన ఎన్ని జీవులు వాటి గూడూ...ఆవాసాలు కోల్పోయి విలవిలలాడుతున్నాయో ఆలోచించం. మనింట్లో మనం ఉండం...ఇంకో జీవిని దాని ఇంట్లో ఉండనివ్వం. అడవుల్ని, ప్రకృతి వనరుల్ని నాశనం చేస్తూ మనం సాగించే 'ధ్వంసరచన'ను ఇంతకన్నా విశాల హృదయంతో...పురోగమన దృష్టితో ఎలా అర్థం చేసుకోవడం?
    భూమి గుండ్రంగా ఉందంటారు కదా? ఇక్కడినించి చూస్తే అమెరికా ఎంత అందంగా కనిపిస్తుందో అక్కడినించి చూస్తే మన ఊళ్ళో పంట కాలువల చుట్టూ పెరిగిన పూలమొక్కల మీద వాలే తూనీగలు అంతకన్నా అందంగా కనిపిస్తాయి. ఎవరికైనా అది అర్థం కావడానికి తప్పనిసరిగా కొంత సమయం పడుతుంది.కామిగానివాడు మోక్షగామి కాడన్నారు గదా. అందుకే.
    ప్రపంచానికి అన్నీ నేర్పిన మనం ఇవ్వాళ మన విశిష్టతని గుర్తించలేకపోవడంలోనే మన వైఫల్యం ఉందనిపిస్తోంది. అవిటివాణ్ణి చూసి అన్నీ ఉన్నవాడు నేర్చుకోవడం ఎంత దయనీయం?
    అభివృద్ది మాటున మనమేమేం కోల్పోతున్నామో గమనిస్తే అభివృద్ది చెందుతూ తమ ఉనికినీ, సంస్కృతినీ పదిలంగా కాపాడుకుంటున్న దేశాలు కొందరికి 'ఛాదస్తంగా' కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఐనా, నేనీ వ్యాసాన్ని దేశాల  దాకా తేవాలనుకోవటం లేదు. ఏ దేశంలోనైనా నిరంతరంగా వేటాడబడుతున్న ఒక డోడో లాంటి జీవికి పరిమితం చేయాలనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే మనకు మాత్రమే పరిమితం చేయాలనుకుంటున్నాను. 'జీవిక' కోసం 'జీవ లక్షణాన్ని' కోల్పోతున్న మనలాంటివాళ్ళ గురించి మాట్లాడదా మనుకుంటున్నాను. మన తెగిపోయిన రెక్కల్ని స్మరించుకుంటూ మన ఉదాసీనతని గుర్తు చేసుకుందామనుకుంటున్నాను.
    ఎంత ముందడుగు వేస్తున్నామనుకుంటున్న జాతి అయినా...basics మరిచిపోయి బాగుపడిన దాఖలా చరిత్రలో లేదు. ఈ జాతికి ఆ basics గుర్తు చేసినందుకే గాంధీజీ మహాత్ముడయ్యాడు. మనకింత జ్ఞాపకశక్తి తక్కువని తెలిస్తే మరో గాంధీజీని cloning చేసి పెట్టుకునే వాళ్ళమేమో?
    ఏదైనా అన్యాయానికి వ్యతిరేకంగా  ఒక ఉద్యమం జరుగుతోందంటే....కనీసం ఒక సినిమా రిలీజయినప్పుడు ఉన్నంతమంది కూడా ఉండరన్నది మన బాధ్యతారాహిత్యాన్నీ (చైతన్యాన్ని) తెలియచేసే ఒక సూచిక మాత్రమే. అక్కడ కూడా 'లంచం తీసుకోకుండా ఓటెయ్యగలరా?' అని అడిగే సినిమాలతో ఎవరికీ సంబంధం ఉండదు.  ఇక 2% సక్సెస్ రేటున్న సినిమాల్లో మనం దేన్ని ఆశించగలం? సినిమాలంటే ఓ మంచి వాక్యం గుర్తుకొచ్చింది...
    Spider man కామిక్ చదివిన వాళ్ళకి ఆ సినిమా చూస్తే ఒక పోలిక కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అది Spider man స్పైడర్ మాన్ లా గెంతడం. మిగతా అంతా ఆ character కి కావాల్సిన కొంత వాస్తవికత (Spider man కా...?) నీ, అస్తిత్వాన్ని కల్పించడం కొరకే ఆ సినిమా రూపకర్తలు ప్రయత్నించడం కనిపిస్తుంది. కామిక్ నిడివితో పోల్చుకుంటే సినిమాకు ఆ మార్పులు తప్పనిసరి. చివరికి part 2 లో అనుకుంటా...మనం (కనీసం పిల్లలు) దారితప్పి, అపార్థం చేసుకోకుండా ఉండటానికి చివర్లో ఒకమాట చెప్పిస్తారు...'Great energy comes from great responsibility' అని.
    మనం సరిగ్గా అన్వయించుకోవాలే గానీ, నిజమే కదా...
                                                                                ***
    సరైన అంశం ఇదే. ఎవరు గుర్తెరగాలి బాధ్యతనీ? ఇలాంటప్పుడే 'మడిసన్నాకా...కాస్త..' అని భుజాలు తడుముకుని నేను కొంచెం గుర్తు పెట్టుకుందామనుకున్నాను. ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చినప్పుడు మా చుట్టుపక్కల ఉన్న దాదాపు చాలా షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు ఇవ్వొద్దనీ, వీలైతే డబ్బులు తీసుకునైనా సరే ఇతరత్రా తయారైన బ్యాగులు అమ్మకానికి పెట్టమని ఆయా షాపులకి వెళ్ళిన ప్రతీసారి చెప్పేవాన్ని. పాపం, వాళ్ళు నామాట విని నిజంగానే ఇవ్వడం మానేసారు...నాకు మాత్రం! చాలామంది నాలాగే చేసి ఉండొచ్చు. ఈ మైక్రాన్ ల గొడవ అర్థమై, అర్థంకాక వొదిలేసి ఉంటారు. ఒక వెసులుబాటు ఉంచుకోవడంలోనే మన వైఫల్యం ఉందేమో కదా?
                                                                                ***
    నేతిబీరకాయల్లో ఉండే సామాజికన్యాయాలూ..చట్టాల వలన ఏ సమాజానికి న్యాయం జరుగుతుందో గత ఎలక్షన్ లలోనే చూశాం...చూస్తున్నాం.  రెక్కలుండీ...ఎగరలేకపోవడం...ఎగరటమే ఒక ప్రహసనంగా మారినప్పుడు ఎగరలేక అవమానపడేకంటే మన రెక్కల్ని మనమే తెగకోసుకోవడం మేలనుకునేలా చేస్తుంది ఇవ్వాళ్టి 'సామాజిక' ఊతపదం. అదో హింస. మనకేం కావాలో దాన్నే ఎరగా మార్చేసిన రొటీన్ రాక్షస క్రీడ. దామాషాలూ...నెగెటివ్ ఓటింగులూ...చాలా దూరపు సంగతి. రెఫరెండం మనకు పట్టని, మన నేతలకు గిట్టని పదం. అయినా సరే...మార్పు అనివార్యమే! కానీ, కొన్ని మార్పులు వాటంతట అవే రావు. ఎక్కడో ఒక వసంత మేఘ ఘర్జన మొదలవ్వాలి.

    The revolution is not an apple that falls when it is ripe. You have to make it fall. -Che

    స్వేఛ్ఛలు హరించబడినప్పుడు, ఆకాంక్షలు గౌరవించబడనప్పుడు, హక్కులు కోల్పోయినప్పుడు బాధ్యతని గుర్తెరిగిన వాళ్ళెవరైనా చైతన్యంతో ప్రశ్నిస్తారు.
    ప్రశ్నిస్తున్నారు కూడా!
    ఇక్కడ కూడా ఒకరు గట్టిగా ప్రశ్నిస్తారు...ఒకరు ఓపిక ఉన్నంతదాకా...శక్తి హరించేదాకా ... నిశ్శబ్దంగా సమాధానం చెప్పుకుంటూనే పోతారు. అలాంటి వాళ్ళు అంతరించిపోవడం కూడా జీవవైవిధ్యానికి పెద్ద విఘాతమేనని నా నిశ్చితాభిప్రాయం. అలాంటి 'బాలగోపాలు'లు ఆబాలగోపాలమై మనకిచ్చిన మానవీయ నేత్రాలతో భవిష్యత్ స్వప్నాన్ని చూడటం ఎలాగో మనం ఇప్పటికైనా నేర్చుకోకతప్పదు.
    ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ కాలంలో అయినా మంచీచెడుల్ని మారుతున్న పరిస్థితులకు అన్వయించుకోవడంలోనే గొప్పదనముంది. 'సత్యాగ్రహం' చేస్తే స్వాతంత్ర్యం వొచ్చితీరుతుందని గాంధీకెవరైనా నమ్మకంగా మాటిచ్చారా? అంతకు ముందు అలాంటివి జరిగినట్టు ఋజువులున్నాయా?  మరి ఆ మహాత్ముడికి అంత విన్నూత్నమైన ఆలోచన ఎలా వచ్చిందనీ? తను నమ్మిన సత్యమ్మీద అంతటి సంకల్ప బలం ఎలా కలిగిందనీ? దాన్ని తన ముందుతరాల వాళ్ళు కూడా విస్మరించలేనంత ధృడంగా అమలు పరచగలిగేంత అఖండమైన శక్తి ఎలా వచ్చిందనీ? తను ఎవరినైతే ఎదిరించాడో వాళ్ళే తన గొప్పదనాన్ని గుర్తించేలా చేసేంత అద్భుతమైన భావజాలం బాపూజీకి మాత్రం ఎక్కడినించి వొచ్చిందీ? ఇంతాచేసి, ఎవరైనా ఇప్పుడు మళ్ళీ సత్యం, అహింసా అంటే నవ్వేసి ఊరుకునే స్థితికి చేరుకున్నాం. బాపూజీ చెప్పినప్పుడు కూడా మొదట్లో ఎందరో నవ్వే ఉంటారు. కానీ ఇప్పుడు మనం అభివృద్ది  చెందాం కదా.
    సరే, అలా కాదనుకున్నా కూడా...ఉద్యమాలు అందరూ చేస్తారు. మనమూ చేస్తున్నాం. ఇప్పటికీ ఏదో ఒక మార్గంలో చిన్నవో...పెద్దవో...ప్రతీ ఊళ్ళో...ప్రతీ ఇంట్లో ఏదో ఒక ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. రకరకాల స్వరూపాల్లో, స్థాయిల్లో జరుగుతూనే ఉంటాయి. ఫేస్ బుక్ లో కూడా ఎన్నెన్ని చూడట్లేదు? ఇక్కడ ఒకటి గమనించాలి. కథాబలం లేని సినిమాలు ఎంత ఊదరగొట్టినా జనాన్ని ఆకట్టుకోలేనట్టే..సరైన స్ఫూర్తి, నిబద్దతా, భావజాలం లేని ఉద్యమాలు ప్రజల మద్దతుని కూడగట్టడంలో అంతిమంగా విఫలమవటం ఖాయం. ప్రజల ఆకాంక్షలతో, ఉద్వేగాలతో శక్తివంతమైన భావజాలమ్మీద రూపుదిద్దుకున్న ఉద్యమం...ప్రజల బలహీనతల మీద పునాదులు సవరించుకునే స్థితికి రాకుడదు. రకరకాల సమీకరణలు ముఖ్య భూమిక వహించే నేటికాలంలో స్ఫూర్తిరాహిత్యం, సృజనశీలత లోపించడం లాంటివి అసలు ఇవ్వాళ్టి ఉద్యమాలకు వర్తిస్తాయని నేను అనుకోవడం లేదు. అన్ని స్థాయిల్లో నాణ్యత లోపించడమే ఇప్పుడు నిస్పృహ కలిగించే విషయం. అన్యాయాన్ని ఎదిరించండంటే అందరూ 'సరే' అంటారు. ఎలా అంటే మొహం వేలాడేస్తారు. ఎలా అనేది చెప్పడంలోనే ఉద్యమం తాలూకూ విజయం దాగిఉంటుంది. కేవలం వ్యతిరేకించడమే అన్ని వేళల్లో సరిపోకపోవచ్చు. అందుకు సరైన కారణం కావాలి...బలమైన వ్యక్తీకరణ కావాలి ...నిబద్దత కావాలి...స్ఫూర్తిమంతమైన పోరాటపటిమ కావాలి...! నిజాయితీకి వన్నెలు తొడిగే సృజన తోడవ్వాలి.
    మొదటిది ఎవరికైనా ఊంటుంది...
    మిగతావే నిర్ణయాత్మకాలు.
                                                                                ***

    ముగింపు:

    ప్రకృతిధర్మం అసంకల్పితమైనది. దానికనుగుణంగా మనుగడ సాగించలేని జీవులు కాలక్రమంలో అంతరించి పోయాయి. అది ప్రాకృతికమైన జీవ పరిణామ క్రమం.  ప్రకృతిధర్మాన్ని నియంత్రించాలనుకోవడంలోనే మనిషి భూమ్మీద కొనసాగిస్తున్న విధ్వంసానికి బీజం పడింది. అప్పుడే జీవపరిణామ క్రమంలో వికారమైన మార్పులు చోటు చేసుకోవడం మొదలయ్యింది.
    అంతరించిపోతున్న జీవుల జాబితాలో మనం పశుపక్షుల, జంతుజాలాల గురించే మాట్లాడుకుంటున్నాం. నాకు ఈ జాబితాలోకి కొత్తగా చేరుతున్న ఆదివాసీలు, గిరిజనులు కనబడుతున్నారు. ఉనికిని కోల్పోతున్న రైతులు కనిపిస్తున్నారు. ఉపాధి కోల్పోతున్న చేతివృత్తుల వారు, ఇతర సాంప్రదాయిక వృత్తులవారు కనిపిస్తున్నారు. ఆధునికత మోజులో పడి చైతన్యాన్ని, జీవలక్షణాన్నీ కోల్పోతున్న సగటు మనిషి కనిపిస్తున్నాడు. అది అర్థం చేసుకోవాల్సి రావడమే ఇప్పుడు నాకు కొంచెం కష్టంగా ఉంది.

                                                                                ***

    ప్రాకృతికంగా 'డోడో' ఒక నిస్సహాయ జీవి. కానీ మనోధర్మం ప్రకారం...ఇంకా చెప్పాలంటే భావదారిద్ర్యం వలన, స్ఫుర్తిరాహిత్యం వలన మనం నిస్సహాయులుగా మారుతున్నాం. ఎప్పుడైనా అవసరానుగుణంగా వేటాడబడేది ఈ నిస్సహాయతే. ఇందుకు భూమ్మీద నివసించే ఆయారకాల జీవులే కాదు...పేదలూ మినహాయింపు కాదు... స్త్రీలూ మినహాయింపు కాదు...కనీసం (ఈ వాక్యం రాయాలంటే కడుపులో దేవినట్టుంది) చిన్నపిల్లలకు కూడా ఇందులో మినహాయింపు లేదు.
            నిజానికి ఇవ్వాళ భూమ్మీద ఎక్కడా 'డోడో' అనే పక్షి లేదు.
    అక్కడక్కడా దాని ఆనవాళ్ళుగా మిగిలిన మనమున్నాం. రెక్కలుండీ ముడుచుకు పడుకున్న 'డోడో'ల్లా అ'సహనం' పాటిస్తున్నాం.
    డోడో అనే పక్షిజాతి అంతరించిపోయిందని నమ్ముతున్నాం.
    నాకైతే ఎక్కడ చూసినా కావల్సినన్ని డోడోలు కనిపిస్తూనే ఉన్నాయి.
    సజీవంగా తిరుగుతూనే ఉన్నాయి...నడుస్తోన్నాయి...నవ్వుతోన్నాయి...
    రెక్కలుండీ ఎగరట్లేదేంటని ఎవరైనా ప్రశ్నిస్తారేమోనన్న సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా  ముడుచుకుపోయి, రెక్కల్ని దాచుకుంటోన్న...రెక్కలే లేనట్టుగా నటిస్తోన్న అసంఖ్యాకమైన డోడోలను నేను రోజూ...కళ్ళారా చూస్తూనే ఉన్నాను.
     ష్...ష్...ష్..! మీకొక రహస్యం చెప్పనా? నాలో కూడా ఒక డోడో ఉంది.



                                                                                ***

                                                                                                                (అయిపోయింది)

As dead as Dodo - రెండో భాగం

Posted by చంద్రం on 10/10/2012 10:19:00 PM
    ఇది ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగిన ఒక సంధర్బంలో రాసుకున్నది. ఈ కవితలో వస్తువుకీ జీవవైవిధ్యానికీ సంబంధం లేదని నేను అనుకోలేకపోయాను.
    మనదేశంలో జీవవైవిధ్య ప్రాముఖ్యతనీ, ప్రభావాన్నీ తెలియచెప్పడానికి ఒక చిన్న ఉదాహరణని చెప్తాను.
    ప్రపంచతీరప్రాంతంలో మన వాటా సుమారు 0.25 శాతం. కానీ తీరప్రాంత జనాభాలో మనవాటా 11 శాతం. ఈ లెఖ్ఖన విస్తీర్ణం, వైశాల్యం కన్నా ఆయా ప్రాంతాల జనసాంధ్రత దృష్ట్యా చూసినా, జీవనాధార పరిస్థితుల దృష్ట్యా చూసినా కూడా మనదేశంలో జీవవైవిధ్య ప్రభావం ఎక్కువే అని తెలుస్తోంది.
    ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం.
    జీవవైవిధ్యాన్ని కోల్పోవడంలో 'వేట' ప్రభావం అత్యంత ముఖ్యమైనది.
    తరువాతే నిర్లక్ష్యం...వగైరా!
    వేట పలురకాలుగా రూపాంతరం చెందుతున్న రోజులివి. వేటాడేటప్పుడు కళ్ళలోకి చూడగూడదనేది వేటలో ప్రాథమిక సూత్రం. వేట స్వభావమే అంత. సర్వకాల సర్వావస్థల్లో కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. ఆకలి...లేదా వినోదం! జంతువులు ఆకలి కోసమే వేటాడతాయి. వినోదం కోసం వేటాడవు. మనమే...! పైన రాసుకున్న కవితలాగా.
    Man chases animals and calls them wild...అని ఈపాటికెప్పుడో మన గుట్టు మనమే విప్పేసుకున్నాం కాబట్టి ఇక ఎందుకూ? ఏమిటీ? అనే తర్కం అనవసరం.
    నిజానికి మనకిప్పుడు వేటాడే తీరికా, అవసరమూ లేదు. 'ఎర' వేయడం నేర్చుకున్నాం. మన దృష్ఠిలో వేటాడం ఇప్పుడు అనాగరికమైన చర్య. 'ఎర' వేయడం వ్యాపారసూత్రం. సాధారణంగా జంతువులు జంతువుల్ని వేటాడేటప్పుడు 'ఎర'వేసి పట్టవు. మాటేసి పడతాయి. కానీ అది అనాగరికం కదా...అందుకే ఇక్కడ మాత్రం ఎర వేయడమే న్యాయం. ఎరకు ఆశపడి, ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకుంటే అది వాళ్ళ బలహీనత.
    ఈ మధ్య మనదేశంలో చర్చనీయాంశంగా మారిన, మీ కందరికీ తెల్సిన ఒక మంచి 'వేట కథ' గుర్తుచేస్తాను.
    మనదేశంలో సుమారు యాబైవేలనించీ లక్షదాకా బియ్యం/వరి రకాలున్నాయని ఒక అంచనా. ఇలాంటివి చాలా రకాల మేధోసంపత్తి హక్కులు మనవి కాకపోవడం ఆశ్చర్యమే కాదు ఆందోళన కలిగించే విషయం కూడా. సాంప్రదాయ వంగడాలకు కొద్దిపాటి మార్పులు చేసి లబ్ది పొందుతున్న మార్కెట్ శక్తుల ఆగడాల ముందు ప్రభుత్వాలే నిస్తేజమవ్వడం మోన్ శాంటో విషయంలో చూసాం. ఒక జాతి సాంప్రదాయ వనరులనే వేటాడి, తన పాదాక్రాంతం చేసుకోగల అమానుష వేట అది. ఇదే తతంగం generic drugs విషయంలో కూడా కనిపించినా అది ఉత్పత్తిదారుడికీ, వినియోగదారుడికీ మేలుచేసేది కాబట్టి ఇక్కడ చర్చనీయాంశం కాదు. వేటకత్తికి ఉండే లేదా ఉండాల్సిన రెండోవైపు పదును తెలియచేయడానికే ఇప్పుడు ప్రస్తావించవలసి వచ్చింది.
    వానపాముల్లాంటి ఎరలు దొరకడం ఇవ్వాళ కొంచెం కష్ఠమేమో గానీ ఇంకా చాలా రకాల ఎరలే మనకివ్వాళ అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి మీ ఇంట్లో tv ఆన్ చేసి చూడండి. కుప్పలు కుప్పలుగా కావాల్సినన్ని ఎరలు మీ ఇంట్లో దూరతాయి. పేపర్ తెరిచారా...ఎరలు... షాపింగుకెళ్ళారా...ఎరలు... ఉద్యోగం కావాలా, సినిమా ఛాన్సు కావాలా, అమెరికా వెళ్ళాలా, అమ్మాయిని పడేయ్యాలా ...ఎరలు...ఎరలు...! క్రికెట్ పండగ మొదలయ్యిందా...కొత్త సినిమా రిలీజయ్యిందా ...మార్కెట్లోకి కొత్త మాడల్ కారొచ్చిందా...స్వంత ఇల్లు కట్టాలా... ఎరలు... ఎరలు...! నేనిక్కడ కావాలనే చాలా ఉదాహరణల్ని మినహాయిస్తున్నాను. ఈ పాటికే మీకు తగినన్ని స్ఫురించిఉంటాయి కదా.   
    అయితే...
    ఇవి వ్యక్తిగతం.
    ఇందులో జాతికొచ్చిన బెంగేమీ లేదు. పడితే గిడితే మీ బాధలు మీరు పడతారు.
    ఇంకొక రకం ఎరలున్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు వరదలా పారేవి. ఎన్నెన్ని ఎరలు? కోటానుకోట్ల మంది జాతిజనుల జీవితాలను సంవత్సరాల తరబడి ప్రభావితం చేసేవి...జాతికి జాతిని ఒకేఒక్క బలహీనతతోనో(మతం), వాగ్ధానంతోనో(ఎన్నో), కుంభకోణంతోనో(ఎన్నెన్ని..) సిగ్గుతో తలొంచుకునేలా చేసేవీ...! రెక్కలుడిగిన డోడోలా మనం నిశ్చేష్టులమైపోయేలా చేసేవీ...ఎవరితో చెప్పుకోవాలో తెలీక నిస్సహాయంగా మనం తలదించుకునేలా చేసేవీ...! మనకు సమస్యలు లేవా? మరి అసహనం ఎందుకు లేదు? గుండెని  జండాలా ఎగరేస్తూ బ్రతకాల్సిన మనం ఎందుకింత ఉదాసీనంగా ఉన్నాం? ఎందుకు మన ఇంటిముందు రోడ్డుని ఏడాదికెన్ని సార్లు వేసినా మనం సంతోషపడుతూనే ఉన్నాం? ఎందుకు కొండల్ని తొలుచుకుపోతున్నా కిమ్మనకుండా చూస్తున్నాం? క్రికెట్ మాచ్ వొస్తున్నప్పుడు కాసేపు కరెంట్ పోతే కలిగే ఆగ్రహం అసలు కరెంటే లేక, పంటలు పండక ఎవరైనా చస్తే ఎందుకు కలగదు? ఊరపిచ్చుకలూ, పెద్దపులులూ, నెమళ్ళదాకా ఎందుకూ...ఇలాగే జరుగుతూపోతే కొన్నాళ్ళకి అడివనేది మిగులుతుందా? రైతనేవాడు మిగులుతాడా? ప్రశ్నించేవాడు కనపడతాడా? డోడోలాగా అంతరించిపోడూ? 'క్విడ్ ప్రో కో' యుగంలో ఏమిచ్చి మన తెగిపోయిన రెక్కల్ని మనం కొనుక్కోగలం?
    ఏమైపోయింది ... దేశానికి దేశం ఒక్కతాటిగా నడిచిన మన చైతన్యం?
    టీవీల్లో గంతులేస్తోంది...వెండితెరమీద విలువలిప్పేస్తోంది...ఫేస్ బుక్కుల్లో మొహం చాటేస్తోంది.
    అంతా అలాగే ఏడుస్తోందని చెప్పలేం కదా? కాదూ...కూడదూ అన్నాసరే, ఎక్కడైనా కొంత మంచీ, చెడూ ఉంటాయి. ఎంతెంత అనేదే ఎప్పుడూ చర్చనీయాంశమౌతుంది.

                                                                                                                  ( మిగతా తరువాయి టపాలో...)


As dead as Dodo - మొదటి భాగం

Posted by చంద్రం on 10/09/2012 12:47:00 PM




        అపుడెప్పుడో, ఎప్పుడైనా ఒకప్పుడు మనదేశం మీద ఎవరైనా దండయాత్ర చేస్తే మనమేం చేసాం? మన ఇంట్లో ఆడాళ్ళతో సహా చీపుర్లు తిరగేసి కొట్టామా లేదా? ప్రపంచంలో ఒక్కరైనా 'ఛీ...ఏంటీ ఈ భారతీయులూ...ఇలా చేస్తున్నారేంటీ...' అని ఈసడించుకున్నారా? లేదు. కనీసం మన చేతిలో చీపురు దెబ్బలు తిన్నవాళ్ళైనా ' వీళ్ళు అనవసరంగా రెచ్చి పోతున్నారు' అని అనుకున్నారా? లేదు. పైగా, అలా చీపురు తిరగెయ్యని జాతులన్నీ కాల (జీవవైవిధ్య /పరిణామ) క్రమంలో అడుగంటిపోయాయి. survival of the fittest అన్నమాట.

        ఎక్కడో మారిషస్ దీవుల్లో ఒకప్పుడు దర్జాగా, హాయిగా బ్రతికిన 'డోడో' అనే పక్షికి ఇదేమీ తెలీదు. అఖ్ఖర్లేదు కూడా. కానీ, పాపం దానికి ఎగరడం రాదు. పరిగెత్తే కాలంతో పాటూ పరిగెత్తలేక ఆనవాలు కూడా కనిపించకుండా అంతరించిపోయేదాకా పోర్చుగీసు వేటగాళ్ళ చేత వెంటాడబడిందని చరిత్రకారుల భోగట్టా.

        ఇవ్వాళ భూమ్మీద ఎక్కడా 'డోడో' అనే పక్షి ( వెంటాడడానికి కాదు, కనీసం చూడ్డానికి ఫోటో కూడా) లేదు. అక్కడక్కడా దాని ఆనవాళ్ళు అనబడేవి ఉన్నాయి. అవి నేర్పుతున్న చారిత్రక సత్యాలున్నాయి. బ్రతకడానికి మనతోటి జీవజాతులతో మనం ఆడే చెలగాటానికి చేదు గుర్తులున్నాయి. మన ఘనకార్యాల తాలూకూ 'నికృష్ఠమైన మరకలున్నాయి. మారిషస్ దీవుల అందమైన దృశ్యాల్లోంచి తుడిచిపెట్టుకుపోయిన 'డోడో' జ్ఞాపకాలున్నాయి.

        ఐనా, ఎవడిక్కావాలి జ్ఞాపకాలు? జాతులకు జాతులే తుడిచిపెట్టుకుపోయే జ్ఞాపకాల్ని ఇంకా ఎంత కాలం పోగేసుకుందాం?


    నాకెప్పుడో రాసుకున్న కవిత గుర్తుకొస్తోంది.


    నడిచే పూలవనం...
    దారంతా పూలపాన్పనుకుంటుంది.
    తోడేళ్ళు బుసకొట్టే చీకట్లో
    అడివంటుకుంది.
    ఎక్కడినించొచ్చావే అందాలమైనా...
    ఇక్కడికి రావొద్దూ...రావొద్దు.
    మా రస హృదయం గురించి
    నీకంతగా తెలిసినట్టు లేదు.
    అందంగా కనిపించే దేన్నైనా సరే,
    వేటాడి బందించందే మాకు నిద్రపట్టదు.
    పిట్టలంటేనే మాకు ఎంతో ఆపేక్ష.
    ఒకటి...మా జాతీయ పిట్ట...
    మరోటి మా రాష్ట్ర పక్షి.
    ఇక మా ఆడాళ్ళనందరినీ మేం
    అందమైన పిట్టలతో సమానంగా చూసుకుంటాం.
    నెమళ్ళనీ, కుందేళ్ళనే వేటాడుతాం అనుకోవద్దు.
    మా జాతిపిట్టయినా సరే, మేం
    తోడేళ్ళకన్నా క్రూరంగా వేటాడి,
    నంజుకుతింటాం.

                                (తరువాయి భాగం రేపు)

                                                             - చంద్రం

బై...బై...గణేశా...

Posted by చంద్రం on 9/29/2012 01:29:00 AM


బై...బై...గణేశా...!




మట్టి గణపతివై మాకు

మంచి చెడు నేర్పేవు...

బొజ్జ గణపయ్యవై

కోరికల  తీర్చేవు...

మా ముద్దు గణపయ్య

మళ్ళి రావయ్యా..!

మా బుద్ది నీవయా

మా సిద్ది నీవయా!




(కొండమీది దేవుడు...కొండంత దేవుడు...చాలా రోజుల క్రితం గీసిన బొమ్మ ఇది.)

మా ఇంట్లోనే జీవవైవిధ్య సదస్సు...రండి.

Posted by చంద్రం on 9/27/2012 04:29:00 PM



    జీవ వైవిధ్య సదస్సు జరుగుతోంది కదా...సంధర్బోచితంగా ఉంటుందనిపించింది.

    కాంక్రీట్ వనాల్లోంచి వెలివేయబడుతున్న అనేక పక్షుల, జంతువుల జాబితా రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో జీవవైవిధ్యం గురించిన సదస్సు మన హైదరాబాదులో జరగటం ముదావహం అని రాస్తే చా...లా మామూలుగా, ఊకదంపుడుగా ఉంటుంది. అంతకన్నా రొటీన్ గా ఈ సదస్సు ముగిసినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు. కానీ మన ప్రభుత్వం ఈ సదస్సుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కదా...త్వరలో ముంబైలాంటి మహానగరాల సరసన చేరటానికి పరుగులు తీస్తున్న హైదరాబాద్ నగరం ఇప్పుడు జరుగుతున్న సదస్సు వలన ఎదైనా (ఇప్పటికైనా)ముందుజాగ్రత్తలు తీసుకోవటానికి ఇది తగిన సమయమని గుర్తిస్తుందేమో? చూద్దాం.

    ఓ పక్కన గనుల కుంభకోణాలు,  ధ్వంసమైపొతూన్న అడవులు, అంతరించిపోతున్న జీవజాతులు, (మరీ విషాధమేంటంటే ఇందులో గిరిజన జాతులు కూడా ఉండటం) మరో పక్క శరవేగంగా విస్తరిస్తోన్న నగర పొలిమేరలు...ఇంతా చేస్తే కడివెడు వానకురిస్తే కదలనివ్వని రహదారులు ఓ పక్క...కుండపోతగా వాన కురిసినా చుక్క నీరు పట్టి దాచుకోలేని ప్రాజెక్టులు మరో పక్కన...ఏది చూసినా మనం ఎన్నో ముందు జగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గట్టిగా నొక్కిఛెప్పేవే.

    ఎన్నైనా చెప్పండి...'ముందడుగు' వేసే విషయంలో మన parameters కొంచెం తికమకగా ఉన్నాయనిపిస్తుంది. ఎక్కడో ఓ చోట, ఎప్పుడో ఓ సారి మనం ముందుకు వెళ్తున్నామా? వెనక్కెళ్తున్నామా అని అలోచించుకోవటానికి కూడా ఇలాగే ఓ సదస్సు ఒకటి జరిగితే బాగుండుననిపిస్తోంది. సరే, ఇది కుంచెం సీరియస్ యవ్వారం కదా...కానీ ఇంతకన్నా సీరియస్ గా ఇలాంటిదే ఒక సదస్సు క్రమం తప్పకుండా మా ఊళ్ళో రోజూ చాలా పంక్చువల్ గా కొన్నేళ్ళుగా జరుగుతోందంటే నమ్ముతారా?

    మీటింగులు లేవు...పబ్లిసిటీ లేదు...ఊరపిచ్చికలు, ఉడుతలు ఏమైపోయాయన్న వెర్రి గందరగోళం లేదు. ఏం చేస్తే ఈ అంతరించిపోతున్న జీవజాలాన్ని కాపాడగలమన్న కన్ ఫ్యూజన్ లేదు...అర్థంకాని ఉపన్యాసాలు లేవు...భీభత్సమైన presentations లేవు. హోటళ్ళు బుక్ చేసే బాధ లేదు...ఎవ్వరూ వొచ్చి చెప్పేది లేదు...కానీ ఒక జీవవైవిధ్య సదస్సు...నిరంతరాయంగా...ఠంచనుగా ఒక దినచర్యలాగా మా ఊళ్ళో, మా ఇంట్లో జరుగుతోంది. గమ్మత్తేమిటంటే...ఈ సదస్సులో ఆయా జీవులు కూడా పాల్గొంటున్నాయి. నమ్మకం లేదా? గత సంవత్సరం  తీసిన ఫోటోల్ని కింద చూడండి.
























    ఇవి ఆ మద్య ఊరెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు.

    మా ఇంటి బాల్కనీ గోడపైనో...మెట్లమీదో...ఎక్కడో ఓ చోట...కాసింత అన్నం...ఓ బెల్లం ముక్క...లేకపోతే కొద్దిగా బియ్యమో...నూకలో వేసి...ఒక చిప్పలో కొన్ని నీళ్ళు పోసి ఉంచటం కొన్నేళ్ళుగా  మా అమ్మ దినచర్యలో ఓ బాగం.


 
    నేను మొదట గమనించలేదు. పాపం ఎప్పుడూ ఉడతల్ని చూడని మా పిల్లలు "డాడీ, ఉడత.." అంటో ఇక దాని వెనక పరుగులు. వీళ్ళని చూసి అది పరుగులు...కాసేపటికి మా పిల్లలు  వేరే ఆటలో పడి అటు వెళ్ళగానే మళ్ళీ ఉడత తయారు. ఊరెళ్ళినప్పుడల్లా మా పిల్లలకు చిన్నపాటి 'జూ' సిద్దంగా ఉంటుంది.




    ఓ పక్క గోడమీది చిప్పలోని నీళ్ళు తాగడానికి రంగురంగుల పిట్టలు ఠంచన్ గా రావడం...మరోపక్క ఉడతలూ...బెల్లం కోసం గోడంతా బారులు తీరే చీమలు...కింద పూలమొక్కల్లో కనిపించే అందమైన కీటకాలు...గోడకావల బురదలో పొర్లే బర్రెలు, వాటితో సయ్యాటలడే కొంగలూ, పక్కనే ఉన్న స్కూల్ కాంపౌండ్ లో తిరిగే మేకలూ...వెరసి మొత్తంగా మా ఇంట్లో ఒక 'జీవ వైవిధ్య' సదస్సు రోజూ జరుగుతున్నట్టే అనిపించింది నాకు.






    మనం అస్సలు పట్టించుకోం గానీ, మనకు తెలిసిన విషయాలను 'అవును...మాకు తెలుసు' అని చెప్పుకోడానికే మనం ఈ సదస్సులు జరుపుకుంటున్నామేమో అనిపిస్తూంది నాకు. నిజంగా చేయాలంటే, ఏం చేయాలో ఈ ప్రభుత్వాలకు తెలీకనా? మా అమ్మకు తెలిసినపాటి విషయం ఇంతమంది అధికారులకు తెలీదని, అందుకే బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారనీ  ఎలా అనుకోగలం?

    డిసెంబర్ 1 వొస్తేగానీ మనకి aids గుర్తుకురాదు. నిండుగా వానలు కురిసి నీళ్ళన్నీ సముద్రం పాలైతేనో...అస్సలు వానల్లేక అలమటించిపోతేనో తప్ప మనకు ప్రాజెక్టులు గుర్తుకురావు. గిరిజనుల ఉనికి గుర్తుకువొచ్చే సమస్యే లేదు. వొచ్చినా ఏంచేస్తాం? పిచికలూ...గ్లోబలైజేషన్ అంటో రాసేస్తాం. అది ఎవడికి అర్థం అవుతుందో, అర్థమై ఏం చేయాలో దేవుడికే తెలియాలిక.

    ఇదంతా ఖర్చు ఎందుకు...సులువుగా ఒక మంచి పరిష్కారం చెప్తాను...సరే, ఎలాగూ మొదలయ్యింది కదా, ఈ సదస్సు గట్రా అయ్యాకా...జీవవైవిధ్యం గురించి నొప్పులు పడే పెద్దమనుష్యులు  మా ఊరికి వొస్తే, మా అమ్మని ఎలాగోలా ఒప్పించి ( ఎందుకంటే...ఇలాంటీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అమ్మకి అస్సలు తీరిక ఉండదు...చేతగాని వాళ్ళే మాడ్లాడుతూ ఉంటారనీ, చేతనైన వాళ్ళైతే చేసేస్తుంటారనీ అమ్మ ఎప్పుడూ చెప్పేది నాకు) ఎలాగోలా నాలుగు క్లాసులు ఏర్పాటు చేస్తాను. ఫర్వాలేదు...ఇంటిపనే తప్ప మరేం తెలీదు అనుకోవద్దు. మా అమ్మ మంచి టీచర్ కూడా.

             
     

    బొమ్మలెలా గీయాలని బాపుగారిని అడిగామనుకోండి...ఆయన 'సాధన' అంటారు. ఎవ్వర్ని సాధిస్తే బొమ్మలొస్తాయో తెలీక ఆయన్నే సాధించే మాలాంటి వాళ్ళకి 'అది చేస్తే బొమ్మలేం ఖర్మ...అన్నీ వొస్తాయి కదా' అన్న తెలివిడి మాత్రం ఊంటుంది.  అలాగనీ, ఆ ముక్క ఆ మహానుబావుడికి చెప్పుకోలేం కదా. అందుకనీ (చిన్నపుడు) అమ్మకి చూపించా. అలా ఒక్కసారి నా బొమ్మవంక చూసి..."బొమ్మ గీస్తే ఏ ముక్కకాముక్క లాగా కనిపించకూడదు...బొమ్మంతా ఒకటే ( integrated) అన్నట్టుగా కనిపించాలా" అని వంద art పుస్తకాల గుట్టు విప్పిచెప్పేది.  ఈ రెండు ముక్కలు నాకెన్ని బొమ్మల్ని నేర్పించాయో మీరు ఊహించలేరు. కాబట్టి, అనవసరంగా కంఠశోషపెట్టుకోకండి.  అమ్మనడిగితే గొంతు నొప్పిక్కూడా ఏదైనా మందు చెప్తుంది కానీ...అవసరమా?

    అందుకే...

    అన్నీ ఇచ్చిన భూమితల్లికి, దాన్ని పదిలంగా కాపాడుతున్న మా అమ్మతల్లికి జేజేలు.




***



    (అన్నట్టు...ఇలా బ్లాగులో చాలా ఫోటోలను పెట్టాల్సి వొచ్చినప్పుడు సహజంగానే size పెరిగి, page load అవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలాంటప్పుడు సాధారణంగా imagesని కావల్సిన sizeకి resize చేసుకుంటుంటాం. ఐతే అంతకన్నా కూడా  imagesని తక్కువ sizeలో save చేసుకోవాలంటే వాటిని విండోస్ లో ఉండే paint లో open చేసి just...save చేయండి. మీ image size దాదాపు సగానికి పైగా తగ్గుతుంది. Image quality కూడా పెద్దగా తగ్గదు. ఇలా చేయడం వల్ల మీ page తొందరగా load అవుతుంది కూడా.)




వినాయక చవితి శుభాకాంక్షలు

Posted by చంద్రం on 9/19/2012 01:36:00 PM




 
ద్వాత్రింశద్గణపతి నామాని 


బాల స్తరుణభక్తౌ చ వీర శ్శక్తి ర్ద్విజ స్తథా
సిద్ధ ఉచ్ఛిష్ట విఘ్నేశౌ  క్షిప్రో హేరంబనామకః ll

లక్ష్మీ గణపతి శ్చైవ మహావిఘ్నేశ్వర స్తథా
విజయః కల్పనృత్త శ్చాప్యూర్ధ్వ విఘ్నేశ ఉచ్యతే ll


 ఏకాక్షరో వర శ్చైవ త్ర్యక్ష రక్షి ప్రదాయకః
హరిద్రాఖ్య శ్చైకదంత స్సృష్టి రుద్దండనామాకః ll


ఋణమోచనకో డుండి  ర్ద్విముఖ  స్త్రిముఖ స్తథా
సింహయోగ శ్చ దుర్గా చ దేవ స్సంకటహారకః ll


ద్వాత్రింశద్విఘ్న రాజాఖ్యా  స్తేషాం ధ్యాన మ థోచ్యతే
ll



అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..!


'కథాకేళి' లో మొదటి 'ఈ బుక్'

Posted by చంద్రం on 9/16/2012 03:30:00 PM



            తెలుగు జాబిలి సాహిత్యం పేజీల్లో మొదలైన 'కథాకేళి' మొదటికథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి 'జుజుమురా' తోనే ఆగిన విషయం గమనించే ఉంటారు. నిజానికి అందుకు కారణం...ఆయా కథలు ఒకసారి ప్రచురించబడ్డాకా తరువాతి కథ వచ్చేసరికి అంతకుముందు అచ్చయిన కథని 'ఈ బుక్' రూపంలో అందించాలని ప్రయత్నించడమే. అదికూడా scan చేసిన పేజీలు కాకుండా చదవటానికి స్పష్ఠంగా కనిపించేలా, సౌకర్యంగా ఉండేలా  అన్ని కథలకు ఒక ప్రామాణికమైన పద్దతిలో అందించడం ఎలా అని ఆలోచించాము. చివరికి ఇప్పుడు అందిస్తున్న 'ఈ బుక్' ఏ రకంగా చూసినా పాఠకులకు పుస్తకం చదువుతున్న అనుభూతిని ఇవ్వగలదని భావించాము. ఒక రకంగా, తెలుగులో తొలిసారిగా మొదలుపెడుతున్న ఈ పద్దతిపై మీ సూచనలు, సలహాలూ తెలియచేయండి. ఒకవేళ మా ప్రయత్నానికి పాఠకుల నించి సరైన స్పందన ఎదురైతే, అందరి అభిప్రాయాలనీ పరిశీలించి మిగతా కథల విషయంలో తగు మార్పులు చేయడానికి ప్రయత్నిస్తాము. మా ప్రయత్నం మి అందరి అభిమానాన్ని చూరగొంటుందని ఆశిస్తూ...


మీ
చంద్రం.




 'జుజుమురా' కథ 'ఈ బుక్' కోసం ఇక్కడ క్లిక్ చేయండి...





Website Copier

Posted by చంద్రం on 9/15/2012 10:03:00 PM



        క్రమం తప్పకుండా  బ్లాగులు రాసేవారికి రాసిన టపాలన్నీ కాపీ, పేస్టు చేసుకోవడం...అవన్నీ వరసక్రమంలో back up తీసుకోవడం నిజంగా శ్రమతో కూడిన పని. అదీకాక ఒక్కోసారి...అ..రు..దు..గా...మన బ్లాగులు కనిపించకుండాపోయే ప్రమాదముంది. అవి ఒక్కోసారి recover చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు కూడా. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో, ఎలా  recover  చేసుకోవాలో తెలీక నానా ఇబ్బందిపడేవాళ్ళని అపుడపుడు చూస్తూనే ఉంటాము.

        ఒక రకంగా చెప్పాలంటే మన బ్లాగు లేదా వెబ్ సైట్ ని యథాతదంగా back up తీసి పెట్టుకోగలిగితే అన్నిరకాలుగా మేలు. కానీ ఎలా? అందుకే ఈ టపా.

        మీరు Windows 2000/ XP/ Vista/ Seven ఉపయోగిస్తున్నట్టైతే ఈ లింకుని క్లిక్ చేసి HTTrack అనే ఈ software ని download చేసుకోండి. 

        http://download.httrack.com/httrack-3.46.1.exe

        లేదా ఈ కింద యిచ్చిన లింకుకి వెళ్ళి, మీకు సరిపోయే వెర్షన్ ని download చేసుకోండి. 

        http://www.httrack.com/page/2/

తరువాత...

        Install చేయండి.

తరువాత...

        HTTrack open చేసి, మీ బ్లాగుని ఏ పేరుతో, ఎక్కడ save చేయాలో type చేయండి.

తరువాత...

        మీ బ్లాగ్ address ని HTTrack లో paste చేయండి. లేదా మీ బ్లాగు open చేసి, address bar లో మీ బ్లాగు url ని కాపీ చేసి, HTTrack లో paste చేయండి.

తరువాత...

        మీ బ్లాగు మొత్తం download అయిపోయేదాకా wait చేయండి.

తరువాత...

        మీరు download చేసుకున్న folderలో 'index' అనే file ని open చేసి చూడండి.

మీ బ్లాగు రెడీ...!

        ఇప్పుడు మీరు internet connection లేకపోయినా (off line) మీ బ్లాగుని open చేసుకుని, యథాతదంగా  చూడొచ్చు...browse చేయొచ్చు.




Happiness is real when...

Posted by చంద్రం on 9/12/2012 10:03:00 PM
   


        ఆ మద్య ఒక సినిమా చూసాను. దాని పేరు 'In to the wild'. ఒక నిజజీవిత కథ ఆధారంగా అల్లబడిన సినిమా. చూస్తున్నంతసేపూ మామూలుగానే చూసాను. సినిమా అయిపోతోంటే కూడా మామూలుగానే ఉంటుంది. చమత్కారమైన డైలాగులు గానీ, ఒళ్ళు గగుర్పొడిచే సీన్లు గానీ, భీభత్సమయిన పతాక సన్నివేశాలు గానీ ఏమీ ఉండవు. అదేం పెద్ద విషయం కాదన్నట్టుగానే ఉంటుంది హీరో వ్యవహారం కూడా.

        సినిమా అయిపోతుంది.

        అపుడు తగులుకుంటుంది 'hook' మనకి...చివరగా హీరో తన డైరీలో రాసుకున్న చివరి ఫంక్తులు చదివాక...

        " Happiness is real when it is shared".

        నాకు అర్థం అయినంతమటుకూ సినిమా చూసినవాళ్ళెవరైనా ఆ తరువాత ఆ ఫంక్తులు మర్చిపోవడం అసాధ్యం. ఆ తరువాత మన జీవితంలో ఎన్నో సంధర్భాల్లో అవి గుర్తుకువొస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడైనా తెలివిగా confuse అయినా మళ్ళీ మనని సరిచేస్తోనే ఉంటాయి. రకరకాల యిజాల  గొడవలో పడి, అన్నీ వొదులుకోమ్మనే వైరాగ్యం నించీ, మొత్తం లాగేసుకోమనే లౌక్యం మద్యన మనం గింజుకుంటున్నపుడు మనల్ని మనం నిటారుగా నిలబెట్టుకోవడానికి గానూ ఈ మాటలు గుర్తుకొస్తూనేఉంటాయి.

        నాకూ గుర్తుకొచ్చాయి...నిన్న ఈ కింద లింకుకి వెళ్ళి, చదివాక.


        నిజానికి ఆ టపా రాస్తున్నపుడు నాకు పెద్ద ఆలోచనేం లేదు. చాలా మందికి పనికొస్తుంది...అంతే! లింకులో శ్రీ భమిడిపాటి గారు ప్రస్తావించిన విషయాలు చదివాకా ఎందుకో పైన రాసినదంతా గుర్తుకొచ్చింది. అయితే జీవితాల్ని మార్చేసెటంత పెద్దవి కానక్కర్లేదు...చిన్నచిన్న విషయాల్లో కూడా ఇంత సంతోషం (మనకీ, ఇతరులకీ) ఉంటుందని ఈ బ్లాగు మొదలెట్టాకా ఇప్పుడే తెలిసింది. ఇంటర్ నెట్ సూత్రం ఉండనే ఉందిగా...sharing is the best. కాకపోతే ఏం share చేస్తున్నామన్నదే ముఖ్యమేమో! ఒక రకంగా ఈ టపా బ్లాగ్ నిర్వహణకి సంబందించి నాకు చాలా విషయాలని నేర్పించింది. సమంజసంగా స్పందించి, దాని ప్రాముఖ్యతని నాకు తెలియచేసిన శ్రీ భమిడిపాటి ఫణిబాబు గారికి నా ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు!

మీ

చంద్రం





'వర్డ్ పాడ్' లో తెలుగులో టైప్ చేయడం.

Posted by చంద్రం on 9/10/2012 08:34:00 PM



             మామూలుగా కంపూటర్ లో తెలుగులో టైప్ చేయడం గురించి ఇంటర్ నెట్ లో చాలానే సమాచారం దొరుకుతుంది. అది చాలామటుకు మన తెలుగు టైపింగ్ అవసరాలని తీరుస్తుంది కూడా. అపుడో, ఇపుడో ఏ బ్లాగులోనో అరకొరా తెలుగు టైప్ చేయడం కాకుండా...కాస్త ఎక్కువ...ఏ కథలాంటిదో ఓ పదిపేజీలు రాయాల్సివస్తే చిన్నచిన్న సమస్యలు వొస్తుంటాయి. 'సేవ్' చేసుకోవడం, కావాలనుకున్నపుడు చప్పున ఓపెన్ చేసుకోలేకపోవడం కొంత అసౌకర్యంగా ఉంటుంది.

             అలా కాకుండా మామూలుగా కంపూటర్ లో విండోస్ లో డిఫాల్ట్ గా అందుబాటులో ఉండే 'వర్డ్ పాడ్' లో ఇంగ్లీష్ లో టైప్ చేసినట్టే పేజీలకు పేజీలు తెలుగు కూడా టైప్ చేసుకోగలిగితే ఎంత హాయికదా?

             ఈ కింద ఇచ్చిన లింకుని క్లిక్ చేసి, ఈ సైట్ కి వెళ్ళి, 'AzhagiPlus-Setup' అనే సాఫ్ట్ వేర్ ని డౌన్ లోడ్ చేసి, ఇన్ స్టాల్ చేసుకోండి.

             http://azhagi.com/sai/plus/AzhagiPlus-Setup.zip
     
             తరువాత మీ కంప్యూటర్ లో తెలుగు యూనికోడ్ ఫాంట్ ఇన్ స్టాల్ చేసి ఉండనట్టయితే ముందుగా తెలుగు యూనికోడ్ ఫాంట్స్ కోసం గూగుల్ సెర్చ్ చేయండి. లేదా...

             ఈ కింది లింకుకి వెళ్ళి, తెలుగు యూనికోడ్ ఫాంట్ ని డౌన్ లోడ్ చేసుకోండి.

             http://adityafonts.com/downloads/Ramaneeya_Font.zip
  
            ముందుగా ఈ ఫాంట్ ని విండోస్ లో ఫాంట్స్ ఫోల్డర్ లో కాపీ చేయండి.

             ఇపుడు మీరు ఇన్ స్టాల్ చేసిన Azhagi+ ని ఓపెన్ చేయండి. మీరు తెలుగులో టైప్ చేయాలనుకుంటే తెలుగు hotkey (Ctrl + 3) ప్రెస్ చేయండి. తరువాత Azhagi+ని ( క్లోజ్ చేయకుండా) మినిమైజ్ చేసి, వర్డ్ పాడ్ లో తెలుగు టైప్ చేసి చూడండి. మొదట్లో టైపింగ్ కొంత ఇబ్బంది కావచ్చు. కానీ మిగతా తెలుగు టైపింగ్ టూల్స్ తో పోలిస్తే అంత కష్ఠం కూడా కాదు.

             ఉదాహరణకి...మీరు 'తెలుగు'  టైప్ చేయాలంటే...telugu అని టైప్ చేస్తే సరిపోతుంది. 'టెల్గూ' అని టైప్ చేయాలంటే TelgU అని టైప్ చేస్తే సరి. అంటే T మరియు U కాపిటల్స్ అన్నమాట. సున్న కోసం కాపిటల్ M నొక్కాలి. నాలుగు లైన్లు టైప్ చేస్తే అంతా అర్థమవుతుంది.

             ఐతే, మద్య మద్యన ఇంగ్లీష్ టైప్ చేయాల్సి వస్తే Ctrl+3 నొక్కండి. ఇంగ్లీష్ నించి తెలుగుకి, తెలుగు నించి  ఇంగ్లీష్ కి మారాలంటే Ctrl+3 ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇదంతా అలా టైప్ చేసిందే.